Friday, November 22, 2024

IPL మీడియా రైట్స్ రూ.44,075కోట్లు.. దక్కించుకున్నదెవరంటే..

IPL మీడియా రైట్స్ చాలా కాస్ట్లీ అన్నట్లుగా జరిగింది. ఈ క్రికెట్ లీగ్ ఐపీఎల్ హక్కుల వేలం కళ్లు చెదిరే ధర పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ చెప్పుకోవచ్చు. మరి దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా ఉండదుగా.. ముంబై వేదికగా దీని కోసం బీసీసీఐ నిర్వహించిన ఈ-వేలంలో ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియో, స్టార్, సోనీ తదితర దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. అయితే చివరకు ఈ హక్కులను అక్షరాలా 44,075 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్యాకేజ్ ఏలో టీవీ హక్కులు, ప్యాకేజ్ బీలో డిజిటల్ హక్కులను బీసీసీఐ అమ్మకానికి పెట్టింది.

వీటిలో ప్యాకేజ్ ఏ అంటే టీవీ ప్రసార హక్కులను సోనీ సంస్థ రూ.23, 575 కోట్లకు దక్కించుకోగా.. భారత ఉపఖండం వరకూ డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ రెండు హక్కులకు కలిపి ఏకంగా 44, 075 కోట్ల రూపాయలు బీసీసీఐకు దక్కాయి. 2023 నుంచి 2027 వరకు మొత్తం ఐదేళ్ల కాలానికి నిర్వహించిన ఈ వేలంలో రెండు ప్యాకేజీలకు కలిపి బేస్ ధరను 33,340 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పుడు అనుకున్న దానికంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అధికంగా రావడంతో బీసీసీఐకి కాసుల పంట పండినట్లే. ఇంత ధర పలకడంతో ఐపీఎల్‌ వచ్చే సీజన్‌లో ప్రతి మ్యాచ్ విలువ రూ.107.5 కోట్లకు చేరింది. ఈ ఐదేళ్ల పాటు ఈ రెండు సంస్థలు ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేయనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement