ముంబై – ఐపిఎల్ ప్లే ఆఫ్స్ చేరేందుకు మొత్తం నాలుగు జట్లకు అవకాశం ఉండగా ఇప్పటికే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వరుసగా తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. ఇక సీజన్‌లో చివరి ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునే జట్టు ఏదన్నది నేడు తేలిపోనుంది. నేడు న్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఒకవేళ ముంబయి, బెంగళూరు గెలిస్తే చెరో 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఈ రెండు జట్లలో ఒకటి ఓడి.. మరొకటి నెగ్గితే.. ఆ గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ఈ రెండూ ఓడిపోతే అప్పుడు ఆర్సీబీ, రాజస్థాన్, ముంబయి తలో 14 పాయింట్లతో ఉంటాయి. ఇలా జరిగితే మెరుగైన రన్ రేటు ఉన్న జట్టు నాలుగో ప్లే ఆప్స్ జట్టుగా స్థానం దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను చెన్నై ఢీ కొడుతుంది. బుధవారం ఎలిమినేటర్‌లో లఖ్‌నవూతో తలపడే జట్టు ఏదన్నదే నేడు మ్యాచ్ జరిగే ఫలితాలను బట్టి తేలుతుంది..
Advertisement
తాజా వార్తలు
Advertisement