Sunday, November 24, 2024

IPL – ప్లే ఆఫ్ నుంచి ఆర్ సి బి ఔట్ – గుజరాత్ సూపర్ విక్టరీ

భారీ స్కోరు చేసినా ఆర్ సి బి కి ఓటమి తప్పలేదు,, గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, చివరి లీగ్ మ్యాచ్ ఓటమి తో ప్లే ఆఫ్ కు చేరుకోలేక పోయింది. ఆర్ సి బి.. నేడు జరిగిన మరో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించిన ముంబై ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. గిల్ సూపర్ బ్యాటింగ్ తో శతకం చేసి గుజరాత్ ను గెలిపించాడు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నాలుగు వికెట్లు నష్టపోయి చేదించింది. 52 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఐ పి ఎల్ లో గిల్ కి ఇది రెండో సెంచూరీ.

కాగా, గుజరాత్ బ్యాటింగ్ లో సాహ అవుటైన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన విజయ్ శంకర్ ఓపెనర్ గిల్ తో కలసి పరుగుల వరద పాటించాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేసి అవుటయ్యాడు.. ఆ వెంటనే షనక సున్నా స్కోర్ తో మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.. మిల్లర్ కూడా 6 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆర్సీబీ బ్యాటింగ్ భారాన్ని మోసిన ఫాప్ డుప్లెసిస్ ,గ్లెన్ మ్యాక్స్ వెల్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్సింగ్స్ తో ఒంటరి పోరాటం చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల చేసింది.తొలి వికెట్‌కి ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఒకే సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకుముందు 2016 సీజన్‌లో కోహ్లీ – ఏబీడీ కలిసి 939 పరుగులు చేయగా ఆ రికార్డుని ఫాఫ్ – కోహ్లీ ఈ సీజన్ లో బ్రేక్ చేశారు. 19 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

3 బంతుల్లో 1 పరుగు చేసిన మహిపాల్ లోమ్రోర్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 67/0 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 85/3కి చేరింది. 16 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన మైకేల్ బ్రాస్‌వెల్, షమీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి డగౌట్ కు చేరాడు. దినేశ్ కార్తీక్, యశ్ దయాల్‌ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ కాగా.. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌ లో విరాట్ కోహ్లీ దూకుడు తగ్గించకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్.. 60 బంతుల్లో సెంచరీ చేశాడు… విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులు చేయగా అనుజ్ రావత్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి ఆర్‌సీబీకి 197 పరుగుల స్కోరు అందించారు. ఇక 198 పరుగుల లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి చేదించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement