అహ్మదాబాద్‌లో భారీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. సాయంత్రం ఏడు గంటలకు వేయాల్సిన టాస్ ఆలస్యం అవుతోంది. దీంతో మరోసారి పిచ్, ఫీల్డ్‌ని పరిశీలించిన తర్వాత అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, ఐపీఎల్-16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని అలరించిన పొట్టి క్రికెట్ లీగ్‌లో ఇవ్వాల (ఆదివారం) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అహ్మదాబాద్ లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. విజేతను తేల్చే మహా సమరాన్ని వీక్షించేందు కు క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇక.. అయిదోసారి కప్ గెలిచి ముంబై రికార్డును సమం చేయాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతుండగా, వరుసగా రెండోసారి కప్ గెలిచి సత్తా చాటాలని హార్దిక్ బృందం పట్టుదలతో ఉంది. బలాబలాల విషయానికొస్తే ఇరుజట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్న ప్పటికీ, గుజరాత్ టైటాన్స్ కే ఫైనల్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు అనలిస్టులు. అయితే ధోనీ వ్యూహాలతో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం చేసే అవకాశమూ లేకపోలేదని కూడా చెబుతున్నారు.