Friday, November 22, 2024

IPL DC vs KKR – టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కె కె ఆర్

ఐపీఎల్ 202 లో నేడు విశాఖపట్నం లోని వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మరికొద్ది సేప‌టిలో తలపడనున్నాయి. కె కె ఆర్ టాస్ గెలిచిన బ్యాటింగ్ఎంచుకుంది.. .. ఐపీఎల్ 2024లో ఢిల్లీకి ఇది నాలుగో మ్యాచ్ కాగా కోల్‌కతా మూడో మ్యాచ్ ఆడనుంది. డిసి మూడు మ్యాచ్‌ల నుంచి 2 పాయింట్ల నికర రన్ రేట్ -0.016తో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. కాగా కేకేఆర్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లు దక్కించుకుని +1.047 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మార్చి 31న జరిగిన మొదటి, మూడో మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్ పై విజయం సాధించింది. టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ మినహా కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రమే ఇప్పటి వరకు అజేయంగా ఉంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఢిల్లీ , కోల్‌కతా మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేకేఆర్ 16, డీసీ 15 గెలుచుకున్నాయి. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. నైట్ రైడర్స్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 228. డిసి పై కోల్‌కతా అత్యధిక స్కోరు 210. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో ఢిల్లీ 3 గెలిచింది. చివరిసారిగా 2021 ఐపీఎల్‌లో కోల్‌కతా ఢిల్లీపై గెలిచింది. విశాఖపట్నంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుంది. ఫ్లాట్ పిచ్ కారణంగా స్పిన్‌కు వ్యతిరేకంగా బ్యాట్స్‌మెన్స్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక్కడ 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఏడుసార్లు విజయం సాధించింది. ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు 54 శాతం గెలుపు అవకాశం ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 46 శాతం ఛాన్స్ ఉంది

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement