క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. కాగా, ఐపీఎల్ మ్యాచ్‌లును జియో సినిమాస్ ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ జియో ఈ ప్రసారాలను ఉచితంగానే అందిస్తోంది. కాగా, తాజాగా 12 భాషలకు చెందిన కామెంటేటర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది జియో.
ఇంగ్లీష్, హిందీతో పాటు గుజరాతి, భోజ్‌పురి, బెంగాలీ, హర్యాన్వి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబిలలో ప్రసారాలను అందించనుంది. ఇంగ్లీష్ కామెంట్రీని దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, బ్రెట్ లీ అనిల్ కుంబ్లే, రాబిన్ ఊతప్ప, గ్రేమ్ స్మిత్, స్కాట్ స్టైరిస్‌లు అందించనున్నారు.
ఇక తెలుగులో భారత టెస్టు క్రికెటర్ హనుమా విహారితో పాటు మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, అశిశ్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్‌జే హేమంత్, ప్రత్యూష, ఆర్‌జే కౌశిక్, సునితా ఆనంద్‌లు కామెంట్రీ వినిపించనున్నారు. హిందీ – సురేశ్ రైనా, జహీర్ ఖాన్, ప్రథ్వీ పటేల్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్, ఆకాష్ చోప్రా, సబా కరీం వంటి మాజీలు చెప్పనున్నారు.
గుజరాతీ – అజయ్ జడేజా, షెల్డన్ జాక్సన్, బార్గవ్ భట్.
పంజాబీ – సునీల్ తనేజా, శరందీప్ సింగ్, రాహుల్ శర్మ.
భోజ్‌పురి – రవి కిషన్, విశాల్ సింగ్, సుమిత్ మిశ్రా.
హర్యాన్వి – వీరేంద్ర సెహ్వాగ్, మన్విందర్ బిస్లా, ప్రీతి దహియా.
బెంగాలీ – ఝులన్ గోస్వామి, శ్రీవత్స్ గోస్వామి, అనుస్తుప్ మజుందార్.
కన్నడ – శ్రీనాథ్ అరివాంద్, బార్త్ చిప్లి, వేద కృష్ణమూర్తి.
మలయాళం – సచిన్ బేబీ, సోనీ చెరువటూర్, రోహన్ ప్రేమ్.
తమిళం – ఆర్ శ్రీదర్, అరుణ్ కార్తీక్, అభినవ్ ముకుంద్.
ఇక ఐపీఎల్ టీవీ పార్ట్‌నర్ అయిన స్టార్ స్పోర్ట్స్ కూడా మూడు రోజుల క్రితమే కామెంటేటర్స్ లిస్ట్‌ను ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతి, బంగ్లా (బెంగాళి) భాషల్లో ప్రసారాలను అందించనుంది. తెలుగులో అంబటి రాయుడు, మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్‌రావు, రాకేశ్ దేవ రెడ్డి, డానియల్ మనోహర్, శశికాంత్ ఆవులపల్లి, రవి రక్లీ, ఆనంద్ శ్రీ కృష్ణ, వింధ్యా మేడపాటి, గీతా భగత్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్టార్ స్పోర్ట్స్‌లో కామెంట్రీ చెప్పనుండటం గమనార్హం.