ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా రేపు ఈ ఐసీఎల్ మినీ వేలం రేపు ప్రారంభం కానుంది. కాగా, కొందరు కీలక క్రికెటర్లను ఫ్రాంచైజీలు వదులుకోగా, పాపులర్ ప్లేయర్లు వేలంలోకి వచ్చారు దీంతో ఈ ఆసక్తికరంగా మారింది. అయితే.. మొదటిసారి ఐపీఎల్ చరిత్రలోనే వేలం భారత్ బయట జరుగుతుండటం విశేషం.
ఈ మినీ వేలంలో 77 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. ఇందులో విదేశీ ఆటగాళ్లకు 30 బెర్తులు ఉన్నాయి. ఇక, ఈ ఆక్షన్లో 333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్ నుంచి ఉండగా 119 మంది ఓవర్సీస్ (విదేశీ) క్రికెటర్లు ఉన్నారు.
మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ప్లేయర్ల కోసం వేలంలో పోటీ పడనుండగా… వేలం కోసం అన్ని జట్లు కలిపి రూ.262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ.38.15 కోట్లు ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద అతి తక్కువగా రూ.13.15 కోట్లు ఉన్నాయి.