Tuesday, November 26, 2024

IPL | శాంసన్‌కు భారీ జరిమానా!

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌పై ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ చర్యలకు దిగింది. మంగళవారం ఢిల్లి క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ ఆవుటైన తీరు వివాదానికి దారి తీసింది. 222 పరుగుల బారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ తరఫును సారథి శాంసన్‌ (86) అద్భుతంగా ఆడుతూ తమ జట్టును విజయపథంలో నడిపిస్తున్న సమయంలో ఓ అనూహ్య ఘటన జరిగింది.

ముఖేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజూ భారీ షాట్‌ ఆడగా బౌండరీ లైన్‌ వద్ద ఉన్న షై హోప్‌ ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే సమయంలో అతడి పాదం బౌండరీలైన్‌ రోప్‌కు తిగిలినట్లు కనిపించింది. కానీ దానిపై స్పష్టత లేకపోవడంతో థార్డ్‌ అంపైర్‌ సంజూను ఔట్‌గా ప్రకటించాడు. దాంతో షాక్‌కు గురైన ఆర్‌ఆర్‌ సారథి ఫీల్డ్‌ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.

మ్యాచ్‌ అనంతరం ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ శాంసన్‌కు భారీ జరిమానా విదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆర్టికల్‌ 2.8 కింద లెవల్‌-1 నేరానికి పాల్పడిన సంజూ శాంసన్‌ మ్యాచ్‌ ఫీజులో 30 శాతం ఫైన్‌ వేస్తున్నట్లు ఐపీఎల్‌ నిర్వహాకులు తెలిపారు. ఇక కీలక సమయంలో సంజూ ఔటవడంతో ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement