ఐపీఎల్ 2024 ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి టైటిల్‌పై కన్నేసిన హైదరాబాద్ ఎడెన్ మార్క్‌రమ్ పై వేటు వేసింది. అందరూ ఊహించినట్టుగానే ప్యాట్ కమిన్స్ ను కెప్టెన్ చేసింది.
ఈ క్రమంలో ఆయా జట్లు ఇప్పటికే తమ హోం గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌కు ముందు డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు ఎవరు ఊహించని రీతిలో ఏకంగా 20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే 17వ సీజన్‌కు హైదరాబాద్ కెప్టెన్ గా కమిన్స్ ను నియమిస్తున్నట్లు SRH ప్రాంచైజీ ప్రకటించింది.
16 సీజన్‌లో మార్ర్కమ్ కెప్టెన్ గా కొనసాగాడు. ఇదిలా ఉంటే కమ్మిన్స్ నేతృత్యంలో ఆస్ట్రేలియా జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్‌లను సాధించి పెట్టాడు. ఈ ఆశలతోనే SRH యాజమాన్యం కమ్మిన్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసి.. కెప్టెన్ గా నియమించింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ జట్టుకు కమిన్స్ ఏ విధంగా ఆదుకుంటాడో వేచి చూడాలి మరి. SRH జట్టు తమ మొదటి మ్యాచ్‌లో కలకత్తా జట్టుతో ఈ నెల 23న ఈడెన్ గార్డెన్‌లో తలపడనుంది.