Friday, November 22, 2024

ఐపీఎల్ అప్పుడు పెడితే..కివీస్ ఆటగాళ్లు దూరం..!‌

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లు నిర్వహించడం బీసీసీఐకి అంత ఈజీకాదని స్పష్టంగా తెలుస్తోంది. 14వ సీజన్‌ రెండో దశకు బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇంగ్లీష్‌ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఇప్పటికే ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశీ స్టార్లు అందుబాటులో లేకుంటే ఆటగాళ్ల సమస్యతో ఫ్రాంఛైజీలు ఇబ్బందిపడటంతో పాటు లీగ్‌ ఆకర్షణ కోల్పోతుంది. ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను ఒకవేళ సెప్టెంబర్‌లో నిర్వహిస్తే న్యూజిలాండ్‌ క్రికెటర్లు లీగ్‌లో పాల్గొనకపోవచ్చు. సెప్టెంబర్‌ నెలలో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్‌ పాల్గొనాల్సి ఉండటమే ఇందుకు కారణం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ తదితరులు ఐపీఎల్‌ మిగతా సీజన్‌లో కివీస్‌ ఆటగాళ్లు ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ముగిసిన తర్వాత లేదా టీ20 వరల్డ్‌కప్‌ ముగిశాక ఐపీఎల్‌-14లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement