ఐపీఎల్ షెడ్యూల్స్ లో ఎలాంటి మార్పు ఉండబోదని బీసీసీఐ తేల్చి చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్ విధించడంతో, వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరుగుతాయా లేదా అన్నదానిపై అభిమానుల ఉత్కంఠకు బీసీసీఐ తెర దించింది. ఆటగాళ్లు మాత్రమే కాదు, సహాయ సిబ్బంది, చివరికి బస్సు డ్రైవర్లు, ఇలా ప్రతిదీ బయో సేఫ్టీ బబుల్ లో ఉన్నందున ఇది సమస్య కాదని బీసీసీఐ భావిస్తోంది. మ్యాచ్ రోజులలో స్టేడియానికి ప్రయాణించడం సమస్య కాదు. ఆటగాళ్లతో పాటు వారి సహాయ సిబ్బందికి కూడా క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో మ్యాచులు జరిగే అవకాశం లేనట్లే. వాంఖడే స్టేడియం ఈ సీజన్‌లో ఏప్రిల్ 10-25 వరకు 10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ ఏప్రిల్ 10 న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఈ జట్లు ముంబైలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని నెట్ప్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ముంబైలోనే ఐపీఎల్ మ్యాచులు..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement