Friday, November 22, 2024

Jose Butler : క్లోహీ, ధోనీ స్పూర్తితోనే..

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలా క్రీజులో చివరకు నిలబడి రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించానని ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోస్ బట్లర్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 నాటౌట్) అజేయ శతకంతో రాజస్థాన్ రాయల్స్‌కు చిరస్మరణీ విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోహ్లీ, ధోనీలను చూసే క్రీజులో చివరి వరకు ఉండటం నేర్చుకున్నానని తెలిపాడు.
‘ఈ మ్యాచ్‌ను నేను గెలిపించడానికి ప్రధాన కారణం నాపై నాకున్న నమ్మకం. కొన్నిసార్లు రిథమ్ అందుకునేందుకు నేను ఇబ్బంది పడుతుంటాను. అలాంటి సమయంలో నన్ను ప్రతికూల ఆలోచనలు వెంటాడుతాయి. అప్పుడు వాటికి భిన్నంగా ఆలోచించడం మొదలుపెడుతాను. నేను ఎక్కువగా గోల్ఫ్ చూస్తాను. ఆ ఆటలో మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని నేను బాగా ఫాలో అవుతాను.
నిరాశకు గురైనప్పుడు.. నా అంతరాత్మను ప్రశ్నించుకుంటాను. నేను బాగానే ఉన్నానని చెప్పడానికి, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఐపీఎల్‌లో ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా క్రీజులో చివరి వరకు నిలబడాలనే విషయాన్ని కోహ్లీ, ధోనీలను చూసి నేర్చుకున్నాను.
ఐపీఎల్‌లో కోహ్లీ, ధోనీ చాలా సార్లు ఆఖరి వరకు ఉండి మ్యాచ్‌లు గెలిపించారు. ఈ మ్యాచ్‌లో నేను వారిలానే ఆడి మ్యాచ్‌ను గెలిపించాను. మా హెడ్ కోచ్ కుమారా సంగక్కర సైతం కొన్ని విషయాలు చెప్పాడు. ‘ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకుంటారు. నువ్వు మాత్రం వాటి గురించి ఆలోచించకుండా క్రీజులో ఉండేందుకు ప్రయత్నించు. ఒక్క షాట్‌తో మూమెంటమ్ మారడంతో పాటు రిథమ్ కూడా దొరకుతుంది.’అని తెలిపాడు.
ఈ మాటలు నా ఆటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇది నా గ్రేటెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్. ఏది ఏమైనా ఔటవ్వకుండా ఆఖరి వరకు ఉంటే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నేను ఆడిన చివరి బాల్ దీనికి నిదర్శనం. నా ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది.’అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement