టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. కుడికాలితో బంతిని అడ్డుకోవాలని చూసి పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. దీంతో మడిమకు గాయం కావడంతో పాండ్యా మైదానం వీడాడు. అయితే ఆదివారం న్యూజిలాండ్‌తో ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌కు అతను దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ మడిమకు గాయమైంది. కాలితో బంతిని ఆపేందుకు ప్రయత్నించి అతను గాయపడ్డాడు. దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వదిలివెళ్లాడు. హార్ధిక్ కాలికి స్కానింగ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం అతను మెడికల్ బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడేది డౌటే అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే ఛాన్సు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ గాయం మరీ సీరియస్‌గా ఏమీ లేదని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కానీ అతను కివీస్‌తో ఆడేది అనుమానంగానే ఉంది. హార్దిక్ పాండ్యా గనుక గాయం తీవ్రత ఎక్కువై జట్టుకు దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే!