Tuesday, November 26, 2024

INDvsSA Tests | రేపే సఫారీలతో టెస్టు సిరీస్‌.. !

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. రేపు (26)న బాక్సింగ్‌ డే టెస్టుతో ఈ సిరీస్‌ మొదలు కానుంది. ఇక సఫారీ గడ్డపై ఒకసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవని టీమిండియా ఈసారి ఆ లోటు తీర్చుకోవాలని చూస్తోంది. సఫారీ గడ్డపై సుదీర్ఘ పర్యటనలో ఉన్న భారత జట్టు ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్‌ కోసం సిద్ధమైంది. సీనియర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తదితరులు టెస్టు సిరీస్‌తో మళ్లి భారత జట్టులో కలుస్తున్నారు. ప్రపంచకప్‌ తర్వాత వీరిద్దరికి ఇదే తొలి సిరీస్‌. మరోవైపు కీలక పేసర్‌ మహ్మద్‌ షమీతో పాటు దీపక్‌ చాహర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌లు తదితర కారణాలతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు.

ఇక మంగళవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం.. టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తుది జట్టులో 11 మందితో కూడిన ప్లేయింగ్‌ ఎలవన్‌ జట్టును ఎంపిక చేశారు. అందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు యువ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేయాలని సూచించారు. అలాగే శుభ్‌మాన్‌ గిల్‌ మూడో స్థానంలో, 4వ స్థానంలో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ చేయాలి. ఇక కీలకమైన ఐదో స్థానంలో కేఎల్‌ రాహుల్‌, ఆతర్వాతి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఆడితే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.

- Advertisement -

ఇక ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు చోటు దక్కింది. వీరిద్దరూ స్పిన్‌తో పాటు అవసరమైన పరుగులు కూడా సాధింగలరన్నారు. అలాగే పేస్‌ త్రయంలో జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, ముఖేష్‌ కుమార్‌లకు అవకాశం కలిపించారు. గాయంతో షమీ దూరమైన అతని స్థానంలో ప్రసిద్ధ్‌ క్రిష్ణ కంటే ముఖేష్‌ ఆడితే బాగుంటుందని గావాస్కర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గవాస్కర్‌ ఎంపిక చేసిన టీమిండియా తుది జట్టు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మాన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ముఖేష్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement