Saturday, November 9, 2024

NZB | క్రీడ‌ల్లో ఇందూరు చరిత్రను చాటాలి..

నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 9 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 16, 17న నిర్వహించే రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఇందూర్ చరిత్రను, క్రీడల్లో ప్రతిభను చాటాలని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ అమ్దాన్ కోరారు.

శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహేర్ హాందాన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంటును నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 16, 17వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్ దాన్, సెక్రెటరీ సత్యనారాయణ, కోశాదికారి గంగా కిషన్ తెలిపారు. 70ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటిసారిగా రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింట‌న్ టోర్నమెంట్ ను క్లబ్ అధ్యక్షులుగా ఉన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కలెక్టర్ చేతుల మీదుగా ఈ క్రీడా పోటీల బ్రోచర్లను స్థానిక కలెక్టరేట్ లో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్రలో ఉన్న 33జిల్లాల షటిల్ క్రీడాకారులు 35ఏళ్లకు పైబడి నుంచి 70 సంవత్సరాల క్రీడాకారులు దాదాపు 600మంది డబుల్స్ షటిల్ పోటీల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడాకారులకు ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ షటిల్ కోర్టుతో పాటు క్యాప్టె న్ హబ్ లో ఆరు షటి ల్ కోర్టులలో ఈ పోటీలను నిష్ణాతులైన కోచ్ లు రెఫరీలుగా మ్యాచ్ కంట్రోలర్ గా వ్యవ హరిస్తారని వెల్లడించారు. షటిల్ డబుల్ పోటీలకు వెయ్యి రూపాయల ఎంట్రీ ఫీజు తో పాటు వారి ఆధార్ కార్డు వయసు ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకు రావాలని చెప్పారు.

- Advertisement -

16వ తేదీన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తారని, 17వ తేదీన సాయంత్రం బహుమతుల ప్రధానం ముగింపు కార్య కము ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ లు కూడా హాజరవుతారని చెప్పారు టోర్నమెంట్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకా రులు ఆన్లైన్లో 8712 300 347 కు నమోదు చేసు కోవా లని కోరారు. ఈనెల 13వ తేదీ వరకు టోర్నమెంట్లో క్రీడాకారులకు తమ పేరు నమోదు చేసుకో వాలన్నా రు. టోర్నమెంట్లో అందరూ భాగస్వాములై విజయ వంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు భక్తవ త్సలం నాయుడు స్వామి దాస్ ఫైనాన్స్ కమిటీ కో కన్వీ నర్ భవంతి దేవిదాస్, ఏటి ఎస్ శ్రీనివాస్ రవి రాజ్ రచ్చ మురళి, అరవింద్ ,కిరణ్ ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement