ఇండోనేసియా ఓపెన్ టోర్నమెంట్ మెన్స్ మరియు ఉమెన్స్ సింగిల్స్ టైటిల్స్‌ను డెన్మార్క్ దిగ్గజం విక్టర్ అక్సెల్‌సెన్, తాయ్ జు యింగ్ చేజిక్కించుకున్నారు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో అక్సెల్‌సెన్ తన ప్రత్యర్థి చైనా దిగ్గజం జావో జున్‌పెంగ్‌పై 21-9, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఇండోనేసియా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో తాయ్ జు యింగ్ తన ప్రత్యర్థి, ఏసియన్ చాంపియన్ చైనా షట్లర్ వాంగ్ హి యిపై 21-6, 21-15 తేడాతో విజయం సాధించింది. ఇండోనేసియా ఓపెన్ విజేత టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జెంగ్ సి వ్యూ- హువాంగ్ యా ఖియాంగ్ జోడీ తమ ప్రత్యర్థి జపాన్ జోడీ వటనబె యుట- హిగషినో అర్సియాపై 21-14, 21-16 తేడాతో విజయం సాధించింది. మెన్స్ డబుల్స్ విభాగంలో లి యు చెన్- ఖు జువాన్‌యి జోడీ కొరియా షట్లర్లు చాయీ- కిమ్‌ను ఓడించి టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. అలాగే మహిళల డబుల్స్ విభాగంలో జపాన్ జోడీ మత్సుయామ నమి, షిదా చిహారు ఇండోనేసియా ఉమెన్స్ డబుల్స్ టైటిల్‌ను మరోమారు కైవసం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.