Thursday, November 21, 2024

Indonesia Open | లక్ష్యసేన్‌ ఔట్‌.. ముగిసిన భారత్‌ పోరాటం

ఇండోనేషియ ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. దీంతో భారత పోరాటం ముగిసింది. శుక్రవారంనాడిక్కడ మెన్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రత్యర్థి వరల్డ్‌ నం.5 అండర్స్‌ అంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో 22-24, 18-21 తేడాతో ఓడిపోయాడు. 61 నిముషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో ప్రారంభం నుంచి లక్ష్యసేన్‌పై డెన్మార్క్‌ షట్లర్‌ ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాడు. తొలి సెట్‌లో 5-5తో సమ ఉజ్జీలుగా కనిపించినా అనంతరం అండర్స్‌ అంటోన్‌సెన్‌ పైచేయి సాధించాడు. వరుస గేమ్‌లతో భారత షట్లర్‌పై అంటోన్‌సెన్‌ విజయం సాధించాడు. సెమీఫైనల్స్‌లో థాయిలాండ్‌ క్రీడాకారుడు కున్లవుట్‌ విటిడ్సర్న్‌తో తలపడనున్నాడు.

భారత్‌ షట్లర్ల విషయానికొస్తే… సింగిల్స్‌లో ప్రియాంషు రజావత్‌ ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో గాయత్రి గోపీ చంద్‌-ట్రిసా జాలీ జోడీ 21-19, 19-21, 19-21 తేడాతో ఏడో సీడ్‌ మయు మత్సుమోటో-వాకనా నాగారా (జపాన్‌) జంట చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. మరో డబుల్స్‌ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ద్వయం రెండో సీడ్‌ దక్షిణ కొరియా జంట బేక్‌ హా నా-లీ సొ హీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి-సిక్కి రెడ్డి జోడీ ఓడి టోర్నీ నుంచి వైదొలగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement