జకార్తా : ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జోడి చరిత్ర సృష్టించింది.. ఆదివారం జకార్తాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో ఆరోన్ చియా-సో వుయ్ యిక్ (మలేసియా) జోడిని ఓడించి విజేతగా నిలిచింది. హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచిన మొదటి భారత జోడిగా రికార్డు నెలకొల్పింది..
ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్ షిప్లో విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాలను అందుకోగా మలేసియా ఓపెన్లో సెమీస్లో ఓడింది. అయితే.. తాజాగా ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటి విజేతగా నిలిచింది.. విజేతగా నిలిచిన ఈ జోడీని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియా అభినందించింది.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
— BAI Media (@BAI_Media) June 18, 2023
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk