Saturday, November 23, 2024

Breaking | ప్ర‌తిష్టాత్మ‌క మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం.. రెచ్చిపోయిన ‘స్కై’

360 డిగ్రీల బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్ చెల‌రేగి ఆడ‌డంతో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) వెస్టిండీస్తో జ‌రిగిన టీ20లో భార‌త్ విజ‌యం సాధించింది. ప్రతిష్టాత్మక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ త‌న అద్భుత‌మైన స్ట్రోక్స్‌తో నెక్ట్స్ లెవ‌ల్‌లో అల‌రించాడు. SKY అని అంద‌రూ ముద్దుగా పిలుచుకునే ఈ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ తప్పక గెలవాల్సిన టైంలో సిక్సర్లతో విరుచుకుప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో నిలిచింది. డేవిడ్ వార్నర్ (105 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (106), విరాట్ కోహ్లీ (120), క్రిస్‌తో సహా విధ్వంస‌క‌ర‌ క్రికెటర్ల జాబితాలో చేరడానికి SKY తన 51వ T20I మ్యాచ్‌లో 44 బంతుల్లో 83 పరుగులు చేశాడు.

SKY క్రీజులో తన అద్భుత ప్రదర్శనలో నాలుగు సిక్సర్లు, 10 బౌండరీలను కొట్టాడు, జార్జ్‌టౌన్‌లోని ప్రావిడెన్స్ స్టేడియంలోని అన్ని భాగాలకు వెస్టిండీస్ బౌలర్‌లను తిప్పాడు. క్రికెట్ అభిమానులకు స్కైని ఫుల్ ఫ్లోలో చూడటం ఆనందంగా ఉంది. అంత‌కుముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (42), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (40) రాణించడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 159/5 ప‌రుగులు చేసి ఇండియాకు స‌వాలు విసిరింది.

ఇక‌.. బౌలర్లలో లెఫ్టార్మ్ చైనామన్ కుల్దీప్ యాదవ్ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. యాదవ్ భార‌త T20Iలలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫీట్ సాధించడానికి కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను మైలురాయిని చేరుకోవడానికి 34 మ్యాచ్‌లు తీసుకున్న స్వదేశీయుడు యుజ్వేంద్ర చాహల్‌ను అధిగమించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement