ఆస్ట్రేలియా, టీమిండియా రెండో మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. హైటెన్షన్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడి రాణించారు. రోహిత్ కెప్టెన్ 46 నాటౌట్‌గా నిలిచి.. తన ఇన్నింగ్స్‌తో సూపర్‌గా ఆకట్టుకున్నాడు. తనదైన స్టైల్లో ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
అయితే.. 39 పరుగుల స్కోరు వద్ద కేఎల్ రాహుల్ (10) పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో కోహ్లీ రంగంలోకి దిగాడు. ఇక కాస్త పర్వాలేదు, బాగానే అడుతున్నారు అనుకున్న టైమ్‌లోనే కోహ్లీ కూడా (11) పరుగులకే బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ ఫస్ట్ బంతికే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయి భారత్ కాస్త ఇబ్బందుల్లో పడ్డట్టు అనిపించింది. కాగా, హార్దిక్ పాండ్యా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. (9) పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుటయ్యాడు.