Monday, November 18, 2024

IND vs SA | సఫారీలతో భారత్ సిరీస్… సౌతాఫ్రికా కెప్టెన్‌పై వేటు !

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన‌ ఆస్ట్రేలియా- భార‌త్ టీ20 సిరీస్ ముగిసింది. 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది యువ‌భార‌త్. ఇక‌, ఇప్పుడు టీమిండియా దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ డిసెంబర్ 10న డర్బన్‌లో ప్రారంభం కానుండగా… ఈ టూర్‌‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌లు, మూడు వన్డేలు, రెండు టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు రెడీ అయ్యింది.

ఈ క్ర‌మంలో క్రికెట్ సౌతాఫ్రికా ఇవ్వాల‌ (డిసెంబర్ 4) తమ జట్లను ప్రకటించింది. అయితే క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఎ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంతకాలం రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న టెంబా బవూమాను పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తప్పించింది. స్టార్ పేసర్ కగిసో రబాడాను కూడా వన్డే, టీ20లకు ఎంపిక చేయలేదు. టెస్టులకు మాత్రం టెంబా బవూమానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20, వన్డేలకు మాత్రం ఎయిడెన్ మార్‌క్రమ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ‌రో ఏడు నెల‌ల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుండ‌డంతో పొట్టి ఫార్మాట్‌కు యువ ఆట‌గాళ్ల‌ను ఎక్కువగా ఎంపిక చేసింది.

ద‌క్షిణాఫ్రికా టీ20 జ‌ట్టు : ఎయిడెన్ మార్క్‌ర‌మ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్‌మ‌న్, మాథ్యూ బ్రీట్జ్‌, నండ్రె బ‌ర్గ‌ర్, డొనొవ‌న్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్‌, హెన్రిచ్ క్లాసెన్, కేశ‌వ్ మ‌హారాజ్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, అండిల్ పెహ్లుక్వాయో, త‌బ్రైజ్ షంసీ, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, లిజాడ్ విలియ‌మ్స్, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జ్, మార్కో జాన్సెన్. వీరిలో లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జ్, మార్కో జాన్సెన్ ల‌ను మొద‌టి రెండు టీ20ల‌కు మాత్ర‌మే ఎంపిక చేసింది.

ద‌క్షిణాప్రికా వ‌న్డే జ‌ట్టు : ఎయిడెన్ మార్క్‌ర‌మ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్‌మ‌న్, నండ్రె బ‌ర్గ‌ర్, టోని డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌, కేశ‌వ్ మ‌హారాజ్, మిహ‌లి ఎంప‌గ్వానా, డేవిడ్ మిల్ల‌ర్, వియాన్ మ‌ల్డ‌ర్, ఆండిల్ పెహ్లుక్వాయో, త‌బ్రైజ్ షంసీ, ర‌స్సీ వాన్‌డెర్ డ‌సెన్, కైల్ వెర్రెయెన్, లిజాడ్ విలియ‌మ్స్

- Advertisement -

ద‌క్షిణాప్రికా టెస్టు జ‌ట్టు : టెంబా బవుమా (కెప్టెన్‌), డేవిడ్ బెడింగ్హ‌మ్, నండ్రె బ‌ర్గ‌ర్, గెరాల్డ్ కొయెట్జ్, టోని డిజోర్జి, డీన్ ఎల్గ‌ర్, మార్కో జాన్సెన్, కేశ‌వ్ మ‌హారాజ్‌, ఎయిడెన్ మార్క్‌ర‌మ్, వియాన్ మ‌ల్డ‌ర్, లుంగి ఎంగిడి, కీగ‌న్ పీట‌ర్స‌న్, క‌గిసొ ర‌బాడా, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, కైల్ వెర్రెయెన్

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

భారత వన్డే జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్-వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.

భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ , ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ (ఫిట్‌నెస్ ఆధారంగా), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement