Wednesday, November 13, 2024

Paris Olympics | ఆరు పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం..

ఒలింపిక్స్‌లో భారత్‌ ఈసారి ఆరు పతకాలతో తన ప్రస్థానాన్ని ముగిసింది. ఈ సారి భారత్ మొత్తంగా ఒక రజతంతోపాటు ఐదు కాంస్య పతకాలు సాధించింది. అయితే, ఏడు ఈవెంట్‌లలో భారత అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాలు సాధించే అవకాశాలను కోల్పోయారు. గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గెహెయిన్ వంటి వారు ఈసారి పతక వేటలో వెనుకబడ్డారు. ఈసారి కచ్చితంగా పతకాలు సాధిస్తారని అనుకున్న లక్ష్యసేన్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు కూడా నిరాశపరిచారు.

ఈసారి భారత్ సాధించిన తొలి మూడు పతకాలు షూటింగ్‌లో వచ్చినవే. అందులో రెండు కాంస్యాలను 22 ఏళ్ల మను భాకర్ కొల్లగొట్టింది. ఇక గత ఒలింపిక్స్‌లో పసిడి గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి రజతానికి పరిమితమయ్యాడు. తన కెరీర్ బెస్ట్ త్రోను విసిరినా.. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అసాధారణ త్రో కారణంగా నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హాకీలో భారత జట్టు 52 ఏళ్ల రికార్డు బద్దలు కొడుతూ కాంస్యం దక్కించుకుంది.

ఒలింపిక్స్ 2024‌ – పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు వీరే..

  1. మను భాకర్ – 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం
  2. మను భాకర్, సరబ్జోత్ సింగ్ – 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం
  3. స్వప్నిల్ కుశాలే – 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం
  4. నీరజ్ చోప్రా – జావెలిన్ త్రోలో రజతం
  5. అమన్ షెరావత్ – రెజ్లింగ్‌లో కాంస్యం
  6. హాకీలో కాంస్యం
Advertisement

తాజా వార్తలు

Advertisement