Friday, November 22, 2024

IND vs SA Test | భార‌త్ రికార్డు స్కోరు.. ధీటుగా సమాధానమిస్తున్న సౌతాఫ్రికా

భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు 600+ సాధించిన మొదటి ఉమెన్స్ టీమ్‌గా టీమిండియా రికార్డులకెక్కింది. చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు‌లో ఈ ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 603 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు (575/9 డిక్లేర్) రికార్డును బద్దలుకొట్టింది.

ఓవర్‌నైట్ స్కోరు 525/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ లంచ్ విరామానికి కొద్దిసేపు ముందు తొలి ఇన్నింగ్స్‌ను 603/6 వద్ద డిక్లేర్ చేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ (69; 115 బంతుల్లో, 4 ఫోర్లు), రిచా ఘోష్ (86; 90 బంతుల్లో, 16 ఫోర్లు) నిలకడగా శనివారం ఆటను మొదలుపెట్టారు. ఈ క్రమంలో అర్ధశతకాలు అందుకున్నారు.

పోరాడిన‌ మరిజానే కాప్, సునే లూయిస్…

- Advertisement -

603 పరుగుల వద్ద టీమ్ ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా, దక్షిణాఫ్రికా జట్టు 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. సునే లూయిస్ (65), మరిజానే కాప్ (69 నాటౌట్) తలో అర్ధ సెంచరీలు చేశారు. దీంతో భార‌త్ పై 367 పరుగుల వెనుకబడి ఉంది. స్నేహ రానా మూడు వికెట్లు, దీప్తి శర్మ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 292 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ సాధించింది. 197 బంతుల్లో 205 పరుగులు చేసింది. 23 ఫోర్లు, 8 సిక్సర్లు బాదింది. మరో ఓపెనర్ తృటిలో 150 మార్క్‌ను చేజార్చుకుంది. 161 బంతుల్లో 149 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. స్మృతి 27 బౌండరీలు, 1 సిక్సర్ బాదింది. జెమీమా రోడ్రిగ్స్ (55; 94 బంతుల్లో, 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టకర్ రెండు వికెట్లు తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement