ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 45వ చెస్ ఒలింపియాడ్‌లో పురుషులు, మహిళల బృందాలు కలిసి తొలిసారి స్వర్ణాలను కైవసం చేసుకున్నాయి. కాగా, భారత మహిళల జట్టు తొలిసారి పసిడిని సాధించి రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో (ఫైనల్ రౌండ్‌లో) 3.5-0.5తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది.
డి.హారిక, దివ్య దేశ్‌ముఖ్‌లు తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా.. ఆర్.వైశాలి డ్రాగా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో మహిళల జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.
పురుషుల బృందంలో గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్… రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్ ఓడించి దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు. గుకేశ్‌తో పాటు అర్జున్ ఎరిగేసి (జాన్ సుబెల్జ్‌పై విజయం), ఆర్ ప్రజ్ఞానంద (అంటన్ డెమ్చెంకోపై విజయం) విజయం సాధించారు.