Thursday, December 5, 2024

U-19 Asia Cup | బోణీ కొట్టిన భార‌త్… జపాన్‌పై భారీ విజ‌యం

అండర్ 19 ఆసియా కప్- 2024లో యువ భారత్ బోణీ కొట్టింది. ఈరోజు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో తో చెలరేగింది. దీంతో 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

మ్యాచ్ లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్ దుమ్మురేపింది. కెప్టెన్ మహ్మద్ అమన్ (122*) అజేయ సెంచరీతో విజృంభించ‌గా… అతనికితోడు కార్తికేయ (57), ఆయుష్ (54)లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (23), సిద్ధార్థ్ (35) రాణించగా… ఆక‌ర్లో హార్దిక్ రాజ్ (25 నాటౌట్) దూకుడుగా ఆడారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. జపాన్ బౌలర్లలో కీఫర్ లేక్, హ్యూగో కెల్లీ రెండేసి వికెట్లు తీశారు.

అనంత‌రం ఛేదనకు దిగిన జపాన్… 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. హుగో కెల్లి (50) అర్థ శ‌త‌కంతో రాణించాడు. చార్లెస్ హింజ్ (35 నాటౌట్) ఆలౌట్ కాకుండా జట్టును కాపాడాడు. భారత బౌలర్లలో ఛేతన్ శర్మ, హార్దిక్ రాజ్, కార్తికేయ తలో రెండు వికెట్లు తీశారు.

కాగా, గ్రూప్-ఏలో పాకిస్థాన్ (4 పాయింట్లు) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో యూఏఈ (2 పాయింట్లు), భారత్ (2 పాయింట్లు), జపాన్ (-4.840) ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement