Friday, November 22, 2024

Olympics | పురుషుల విభాగంలో భారత్‌కు తొలి పారిస్‌ బెర్త్ క‌న్ఫామ్

భారత యువ బాక్సర్‌ నిషాంత్‌ దేవ్‌ ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్‌ అర్హత పోటీల్లో నిషాంత్‌ దేవ్‌ క్వార్టర్‌ ఫైనల్లో విజయం సాధించాడు. తద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌-2024కు అర్హత సాధించాడు.

శుక్రవారం జరిగిన పురుషుల 71 కిలో విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో నిషాంత్‌ దేవ్‌ 5-0తో మొల్డొవా బాక్సర్‌ వెసిలే సెబొటరీను తన పంచ్‌ పవర్‌తో మట్టి కరిపించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. దాంతో భారత్‌ తరఫున పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించిన తొలి పురుష బాక్సర్‌గా నిషాంత్‌ రికార్డు సృష్టించాడు.

దాంతోపాటు మొత్తంగా విశ్వక్రీడలకు అర్హత సాధించిన నాలుగో భారత బాక్సర్‌గా కూడా నిషాంత్‌ రికార్డుల్లో నిలిచాడు. అతడి కంటే ముందు ముగ్గురు మహిళా బాక్సర్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), ప్రీతి పవార్‌ (54 కిలోలు), లవ్లినా బొర్గెహెన్‌ (75 కిలోలు) ఇప్పటికే విశ్వ క్రీడలకు అర్హత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement