Saturday, November 23, 2024

హైజంప్‌లో భార‌త్ ఖాతాలో తొలి ప‌త‌కం.. చ‌రిత్ర సృంష్టించిన తేజ‌స్విన్ శంక‌ర్..

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత ఖాతాలో మరో పతకం చేరింది. హైజంప్‌లో విభాగంలో భార‌త్ ఖాతాలో తొలి ప‌త‌కం న‌మెదైంది. భారత్ త‌రుపున ఆడిన తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 2.22 మీటర్ల దూరం జంప్ చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్‌ కెర్‌ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్‌ స్టార్క్‌ సిల్వర్‌ సాధించాడు.

దేశానికి కాంస్య పతకాన్ని అందించిన శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ‘తేజస్విన్ శంకర్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో హైజంప్‌ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ప్ర‌ధాని అభినందనలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement