ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్న ఏకైక భారత ఆటగాడు కిరణ్ జార్జ్‌కు మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ వితిద్సరన్ తో తలపడిన కిరణ్… 14-21, 6-21 పాయింట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇక ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాంషు రజావత్ లు తొలి రౌండ్ మ్యాచ్‌లలోనే ఓడిపోవడంతో ఇండొనేషియా మాస్టర్స్ లో భారత్ పోరాటం ముగిసింది.