పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జోడీ సాత్విక్ – చిరాగ్‌లతో పాటు మహిళల ద్వయం ట్రీసా జాలీ – గాయత్రి గోపిచంద్‌ల జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
పురుషుల డబుల్స్‌లో చిరాగ్ – సాత్విక్‌లు తొలి రౌండ్లో 21-13, 24-22 తేడాతో మలేషియాకు చెందిన మ్యాన్ వీ చోంగ్ – కై వున్ టీ లను ఓడించింది. గత 8 మ్యాచ్‌లలో మలేషియా ఆటగాళ్లతో చిరాగ్ – సాత్విక్‌లకు ఇది ఐదో గెలుపు.
ట్రీసా – గాయత్రిల ద్వయం 16-21, 21-19, 21-17 తేడాతో తనీషా క్రాస్టో -పొన్నప్పలను ఓడించింది. ఇక సింగిల్స్ ఈవెంట్స్‌లో భారత్ తరఫున లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్‌లు తొలి రౌండ్ ఆడనున్నారు.