Saturday, November 23, 2024

Exclusive | భారత బ్యాటర్ల జోరు.. ఆస్ట్రేలియాకు అదిరిపోయే టార్గెట్​!

ఆస్ట్రేలియాపై భారత క్రికెట్​ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఓపెనర్లలో రుతురాజ్​ గైక్వాడ్​ (8) పరుగులకే అవుటయినా మిగతా వారు దంచికొట్టడంతో టీమిండియా మంచి స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 399 పరుగులు చేసి కేవలం అయిదు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇక… ఆస్ట్రేలియా ముందు 400 పరుగుల భారీ లక్ష్యం పెట్టారు భారత బ్యాటర్లు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ (8), గిల్ (104), శ్రేయ‌స్ (105), కేఎల్ రాహుల్ (52), ఇశాన్ కిష‌న్ (31), సూర్య‌కుమార్ 72, జ‌డేజా 13 ప‌రుగుల‌తో అద్భుతంగా రాణించారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇద్దరు బ్యాటర్లు రెండు సెంచరీలు నమోదు చేయగా.. భార‌త స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రోసారి త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు. శివ‌మెత్తిన‌ట్టు సూర్యకుమార్​ చెల‌రేగాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవ‌ర్లో నాలుగు బంతుల‌కు నాలుగు సిక్సులు బాదాడు. అత‌డి ఊపు చూస్తుంటే 2007 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో యువ‌రాజ్ సింగ్ లా ఆర్ సిక్స్‌లు కొడతాడు అనిపించింది. కానీ, గ్రీన్​ అయిదో బంతిని పిచ్​కు దూరంగా వేయడంతో రికార్డును తిరగరాసే చాన్స్​ మిస్సయ్యింది.

- Advertisement -

కోహ్లీ అయితే రికార్డు స్థాయిలో నాలుగు ఏళ్లు (2012, 2017, 2018, 2019) వ‌న్డేల్లో ఐదుసార్లు వంద కొట్టాడు. రోహిత్ మూడుసార్లు(2017, 2018, 2019)లో ఐదు శ‌త‌కాలు సాధించాడు. స‌చిన్ 1996, 1998లో ఈ ఘ‌న‌త సాధించాడు. గంగూలీ, ద్ర‌విడ్, ధావ‌న్ మాత్రం ఒకేసారి ఈ రికార్డు నెల‌కొల్పారు.

ఐదో క్రికెట‌ర్‌గా మ‌రో రికార్డు
అంత‌ర్జాతీయంగా చూస్తే.. 25 ఏళ్ల వ‌య‌సులో ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో 5 శ‌త‌కాలు కొట్టిన ఐదో క్రికెట‌ర్‌గా గిల్ మ‌రో రికార్డు సొంతం చేసుకున్నాడు. అవును.. భార‌త దిగ్గ‌జం స‌చిన్ టెండూర్క‌ర్(1996లో), ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 2005లో, శ్రీ‌లంక క్రికెట‌ర్ ఉపుల్ త‌రంగ 2006లో, విరాట్ కోహ్లీ 2012లో ఈ మైలురాయిని అందుకున్నారు.

కంగారూల‌పై రికార్డు భాగ‌స్వామ్యం
ఈ మ్యాచ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌(105)తో కలిసి గిల్ రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీళ్లిద్ద‌రూ రెండో వికెట్‌కు 200 ర‌న్స్ జ‌మ చేశారు. దాంతో, వ‌న్డేల్లో కంగారూల‌పై అత్య‌ధిక భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన నాలుగో భార‌త జోడీగా గిల్, అయ్య‌ర్ రికార్డు క్రియేట్ చేశారు.

గిల్ , శ్రేయ‌స్ అయ్య‌ర్‌
ఈ జాబితాలో మాజీ ప్లేయ‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్(VVS Laxman), ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్(Yuvraj Singh) సింగ్ టాప్‌లో ఉన్నారు. వీళ్లు 2004లో ఆసీస్‌పై 213 ర‌న్స్ చేశారు. విరాట్ కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్ జోడీ రెండో స్థానంలో ఉంది. వీళ్లు 2016లో 212 ర‌న్స్ జోడించారు. రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ 2016లోనే 207 ప‌రుగులు జోడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement