ఆసియా క్రీడల్లో ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన సెమీస్ మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 రన్స్ మాత్రమే చేసింది.
ఆ తర్వాత స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. ఈజీగా ఆ లక్ష్యాన్ని అందుకున్నది. 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. రుతురాజ్ 40, తిలక్ వర్మ 55 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. క్వార్టర్స్‌లో సెంచరీ కొట్టిన జైస్వాల్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.
అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సాయి కిషోర్ తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. ఇక సుందర్‌కు రెండు వికెట్లు దక్కగా, మరో నలుగు బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. తిలక్ వర్మ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 55 రన్స్ చేయగా.. రుతురాజ్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 40 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు.