Friday, November 22, 2024

అద్భుతంగా రాణించిన భారత రెజ్లర్‌..

అండర్‌ -20 ప్రపంచ చాంపియన్‌ షిప్స్‌ టోర్నీలో భారత రెజ్లర్‌ అంతిమ్‌ అద్బుతంగా రాణించింది. వరుస విజయాలతో 53 కేజీల కేటగిరిలో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఈ యువ రెజ్లర్‌ బల్గేరియాలోని సోఫియావేదికగా జరిగిన తుదిపోరులో కజకిస్థాన్‌కు చెందిన ఆల్టిన్‌ షగయేవాపై సునాయస విజయం సాధించింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అంతిమ్‌ .. 8-0 తేడాతో అల్టిస్‌ను మట్టి కరిపించి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా అండర్‌ -20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.

17 ఏళ్ల అంతిమ్‌ ఈ ఏడాది జరిగిన ఏషియన్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో కూడా స్వర్ణం ముద్దాడింది. కామన్‌వెల్త్‌లో ఆడాల్సింది. కానీ ఆ మెగాటోర్నీ కోసం జరిగిన అర్హత పోటీల్లో వినేష్‌ ఫోగట్‌ చేతిలో ఓటమిపాలై కామన్‌ వెల్త్‌ క్రీడలు మిస్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement