Thursday, November 21, 2024

Sports: స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియాకి యూకే వీసా మంజూరు.. టెన్షన్​ పడొద్దన్న స్పోర్ట్స్​ అథారిటీ!

బర్మింగ్​హామ్​లో ఈనెల 28 నుంచి జరిగే కామన్​వెల్త్​ గేమ్స్​లో పార్టిసిపేట్​ చేయడానికి స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియాకు ఇప్పుడు ఎటువంటి టెన్షన్​ అవసరం లేదని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) తెలిపింది. ఎందుకంటే మొన్నటిదాకా యుకె వీసా కోసం తను తెగ టెన్షన్​పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెలలోనే కామన్​వెల్త్​ గేమ్స్​కి ప్రిపరేషన్​ కోసం యూఎస్​ వెళ్లాల్సిన పునియా టూర్​ ఆలస్యమైంది.

స్టార్ ఇండియన్ రెజ్లర్ బజరంగ్ పునియా రాబోయే కామన్వెల్త్ గేమ్స్ కోసం తన UK వీసాను అందుకున్నాడు. ఇది బర్మింగ్‌హామ్ కామన్​వెల్త్​ గేమ్స్​ (CWG)కి ముందు శిక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ కు బయలుదేరడానికి వీలు కల్పిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) శనివారం తెలిపింది. అతను యునైటెడ్ స్టేట్స్ లోని తన శిక్షణా స్థావరం నుండి నేరుగా CWGకి వెళ్తాడు.. కాబట్టి, UK వీసా ఫార్మాలిటీలను పూర్తి చేయడం బజరంగ్‌కి కష్టంగా ఉండేది. ఇప్పుడు అతను UK వీసా పొందాడు కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా USలో శిక్షణ పొందవచ్చని స్పోర్ట్స్​ అథారిటీ తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత 28 ఏళ్ల బజరంగ్​ పునియా బర్మింగ్‌హామ్ CWGకి ముందు శిక్షణ కోసం గత నెలలోనే USలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి వెళ్లాల్సి ఉంది. అయితే అతను UK వీసా పొందడంలో ఆలస్యం కారణంగా దేశంలో ఉండవలసి వచ్చింది. “క్రీడా మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా, బ్రిటిష్ హైకమిషన్‌ను సంప్రదించడంతో పని ఈజీ అయ్యింది” అని SAI మీడియాకు తెలిపింది.  జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్​వెల్త్​ గేమ్స్​ జరగనున్నాయి.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement