స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్‌లో బాంబ్రీ, అల్బానో ఒలివెట్టి జోడీ విజయం సాధించింది. టైటిల్ పోరులో బాంబ్రీ జోడీ అదరగొట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫాబ్రిస్ మార్టిన్, ఉగో హంబర్ జంటను 3-6, 6-3, 10-6 తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడారు. దాంతో భారత యువ ఆటగాడు బాంబ్రీ ఖాతాలో మూడో ఏటీపీ టైటిల్ చేరింది. అయితే ఇప్పటి వరకు అతడు అందుకున్న టైటిల్స్ కూడా 250 సిరీస్ లోవే కావడం విశేషం.
నాదల్‌కు భంగపాటు..
మరోవైపు రెండేండ్ల తర్వాత స్విస్ ఓపెన్ ఫైనల్ ఆడిన మాజీ నంబర్ 1 రఫెల్ నాదల్ ను పోర్చ్‌గల్ కుర్రాడు నునో బెర్జెస్ ఓడించాడు. నాదల్ పై 6-3, 6-2తో విజయం సాధించాడు. తొలి ఏటీపీ ఫైనల్లోనే నునో బెర్జెస్ టైటిల్ విజేతగా అవరించడం విశేషం. దాంతో, ఒలింపిక్స్ ముందు ఏటీపీ ట్రోఫీ గెలవాలనుకున్న నాదల్ కల కలగానే మిగిలింది.