డబ్ల్యూటీటీ ఫీడర్ కొర్పస్ క్రిస్టీ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత యువ ప్లేయర్లు శ్రీజ ఆకుల, మానవ్ టక్కర్ సెమీస్‌లో ప్రవేశించారు. ఆమెరికాలో ఇవ్వాల (గురువారం) జరిగిన మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి శ్రీజ 11-9, 9-11, 11-1, 6-11, 11-9 తేడాతో అమెరికాకు చెందిన అమీ వాంగ్‌పై విజయం సాధించింది.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో 2 సెట్లు గెలిచి మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొల్పారు. ఇక నిర్ణయాత్మకమైన ఆఖరి సెట్లో మాత్రం శ్రీజ ఏకగ్రతతో ఆడి ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చెలయించి ఈ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మానవ్ టక్కర్ 11-6, 11-8, 7-11, 12-10 పాయింట్ల తేడాతో నియగొల్ స్టొయనొవ్ (ఇటలీ)పై విజయం సాధించి సెమీల్లో ప్రవేశించాడు. మరో క్వార్టర్స్‌లో హర్మీత్ దేశాయ్ 10-12, 11-6, 7-11, 9-11 తేడాతో క్రిల్ జెరసిమెన్కో (కజాకిస్తాన్) చేతిలో పోరాడి ఓడాడు.