Friday, September 20, 2024

IRF | 24 నుంచి రేసింగ్‌ పోటీలు..

హైదరాబాద్‌: ఆగస్టు 24 నుంచి ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టీవల్‌ (ఐఆర్‌ఎఫ్‌) లీగ్‌, ఎఫ్‌ఐఏ పోటీలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్‌బర్డ్స్‌ హైదరాబాద్‌ జట్టుకు టాలీవుడ్‌ హీరో నాగచైతన్య యజమానిగా వ్యవహరించనున్నాడు. తనకు ఫార్ములా-1 రెసులంటే ఎంతో ఇష్టమని నాగచైతన్య తెలిపాడు. సూపర్‌ కార్స్‌, మోటర్‌ సైకిల్స్‌పై చాలా ఆసక్తి ఉందన్నాడు.

అందుకే హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ జట్టును కొనుగోలు చేశాను. ఈసారి పోటీల్లో తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు రెడీగా ఉందని నాగ చైతన్య పేర్కొన్నాడు. కాగా ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టీవల్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌), ఫార్ములా 4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌ (ఎఫ్‌4ఐసీ) పోటీలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement