భారత్, జింబాబ్వే మధ్య జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జట్టును ప్రకటించింది. ఈ ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే జింబాబ్వే బయలుదేరింది. ఈ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.
అయితే, తొలి రెండు టీ20ల కోసం భారత జట్టులో పలు మార్పులు చేశారు. ప్రపంచకప్ కోసం వెస్టిండీస్‌కు వెళ్లిన భారత జట్టు బెరిల్ తుపాను కారణంగా రెండు రోజుల పాటు బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. ఇందులో సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నారు. దీంతో వీరి స్థానంలో…… సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వేతో మూడో టీ20కి ముందు శాంసన్, దూబే, యశస్విలు జట్టుతో కలవనున్నారు.
జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్0, హర్షిత్ రాణా.
చివరి మూడు టీ20లకు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (కీపర్), ధ్రువ్ జురెల్ (కీపర్), శివమ్ దూబె, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.
జింబాబ్వే జట్టు :
సికిందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జొనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవేర్, తాడివానాషే మారుమణి, వెల్లింగ్‌టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ఎన్ మ్యురాబనీ, బ్లెస్సింగ్ ఎన్ మ్యుజరబ్ని శుంబా.
షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 (జులై 6)
రెండో టీ20 (జులై 7)
మూడో టీ20 (జులై 10)
నాలుగో టీ20 (జులై 13)
ఐదో టీ20 (జులై 14)
రెండు దేశాల మధ్య జరిగే అన్ని మ్యాచ్‌లు హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం, అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి.