Tuesday, November 26, 2024

భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ కు ఎస్పీగా ప్రమోషన్

టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తునే ఉంది. 40 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంతో దేశనలుమూల నుంచి టీమిండియాకు రివార్డులు పోటెత్తుతున్నాయి. ఇక, హాకీ జట్టు సారథి మన్ ప్రీత్ సింగ్ కు పంజాబ్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మన్ ప్రీత్ ప్రస్తుతం పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో డీఎస్పీగా పనిచేస్తున్నాడు. అయితే, టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టును అద్భుత రీతిలో నడిపించి, 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం అందించాడు. ఈ నేపథ్యంలో, మన్ ప్రీత్ కు ప్రమోషన్ ఇస్తున్నామని పంజాబ్ క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీ వెల్లడించారు. మన్ ప్రీత్ ఇకపై పంజాబ్ పోలీసు విభాగంలో ఎస్పీ ర్యాంకు అధికారి అని తెలిపారు.

ఇది కూడా చదవండి:సెంచరీతో అదరగొట్టిన రాహుల్.. మెరిసిన రోహిత్..

Advertisement

తాజా వార్తలు

Advertisement