బర్మింగ్‌హామ్ వేదికగా జులై 29 నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత మహిళల హాకీ బృందం సోమవారంనాడు బార్సిలోన నుంచి బస్సులో లండన్ చేరుకుంది. కెప్టెన్ – గోల్‌కీపర్ సవిత పునియా నేతృత్వంలో 18మంది సభ్యుల బృందం నేరుగా నాటింగ్‌హామ్‌లోని శిక్షణ కేంద్రానికి చేరుకుంది. జులై 1 నుంచి 17 వరకు స్పెయిన్- నెదర్లాండ్స్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ బృందం అద్భుతంగా రాణించి చైనా కలిసి 9వ స్థానంలో నిలిచింది.
అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో తమ తప్పిదాలను సరిదిద్దుకుని పతకం చేజిక్కించుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ సవిత పునియా పేర్కొన్నారు. జులై 29న ప్రారంభమయ్యే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు తొలుత ఘనతో తలపడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.