Saturday, November 23, 2024

భార‌త ఫుట్ బాల్ జ‌ట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి డాక్యుమెంట‌రీ-అభినందించిన ప్ర‌ధాని

కెప్టెన్ ఫెంటాస్టిక్ పేరుతో భార‌త ఫుట్ బాల్ జ‌ట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రిపై డాక్యుమెంట‌రీ రూపొంద‌నుంది. అత‌ని జీవితం, కెరీర్‌పై ప్రపంచ ఫుట్‌బాల్ స‌మాఖ్య (ఫిఫా) ప్ర‌త్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. మూడు ఎపిసోడ్‌ల ఈ డాక్యుమెంట‌రీని తాజాగా విడుద‌ల చేసింది. ఆట‌గాడిగా ఛెత్రి సాధించిన విజయాలతో పాటు భార‌త జ‌ట్టులోకి రావడానికి అత‌ను పడిన కష్టాలను కళ్లకు కట్టింది. ‘కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌’ పేరుతో రూపొందించిన‌ ఈ డాక్యుమెంటరీ త‌న అధికారిక స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన‌ ఫిఫా లో అందుబాటులో ఉంచింది. ‘దిగ్గ‌జ ఫుట్ బాట‌ర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోన‌ల్‌ మెస్సీ గురించి మీ అంద‌రికీ తెలుసు. ఇప్పుడు అత్యధిక అంత‌ర్జాతీయ గోల్స్ సాధించిన మూడో ఆటగాడి గురించి కూడా తెలుసుకోండి’ అని ఫిఫా పేర్కొన్న‌ది.సాధార‌ణంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఆట‌గాళ్ల గురించి ఫిఫా ఇలాంటి డాక్యుమెంట‌రీలు చేస్తుంటుంది. ఛెత్రిపై ఇలాంటి ఎడిసోడ్ చేసిందంటే అది చాలా గొప్ప విష‌యం. ఇది ఛెత్రితో పాటు భార‌త ఫుట్‌బాల్ కు కూడా గ‌ర్వ‌కార‌ణం అనొచ్చు. దీనిపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. ఛెత్రిని అభినందించిన మోదీ.. భార‌త్ లో ఫుట్ బాల్ మ‌రింత‌గా ప్రాచుర్యం చెందేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement