భారత గడ్డపై ఫుట్‌బాల్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చిన ఆటగాడు సునీల్ ఛెత్రి. 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ చేసి.. అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా రోనాల్డొ, మెస్సీ పక్కన నిలిచాడు. ఇండియన్ ఫుట్‌బాల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సునీల్ ఛెత్రి తాజాగా ఫుట్‌బాల్‌కు ఆటకు వీడ్కోలు పలికాడు. జూన్ 6న కువైట్‌తో జరిగే ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు.
భారత్ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు సునీల్ ఛెత్రి. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 94 గోల్స్ కొట్టాడు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టివ్ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్ చేసిన మూడో ఆటగాడు సునీల్ ఛెత్రి కావడం విశేషం. అతడి కంటే ముందు ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్ మెస్సి (106) మాత్రమే ఉన్నారు.