భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శ్రుతి రఘునాధన్ను వివాహం చేసుకున్నాడు. గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరగ్గా, ఆదివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన శ్రుతి ప్రస్తుతం బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తున్నారు.
వెంకటేశ్-శ్రుతి జంటకు క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు, కామెంట్లు పెట్టారు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ టైటిల్ నెగ్గడంలో వెంకటేశ్ అయ్యర్ కీలక భూమిక పోషించాడు. కీలకమైన తొలి క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలతో జట్టుకు ట్రోఫీ అందించడంలో సాయపడ్డాడు. టీమిండియా తరఫున రెండు వన్డేలు, 9 టీ20లు ఆడాడు.