Thursday, November 21, 2024

నాలుగో ర్యాంక్‌కు పడిపోయిన భారత్‌

ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో ఐసీసీ ఛాంపి యన్‌షిప్‌ ర్యాంకుల్లో భారత్‌ నాలుగో స్థానానికి దిగజారింది. ఇక రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టు ఫైనల్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది. దీంతో చివరి మూడు మ్యాచ్‌లు ఇరుజట్లకు కీలకం కానున్నాయి. న్యూజిలాండ్‌ 70శాతం విజయాలతో ఇప్పటికే ఫైనల్‌కు చేరింది. మరోస్థానం కోసం ప్రధానంగా భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రే లియా పోటీపడుతున్నాయి. ఆసీస్‌పై విజయంతో అగ్రస్థానం దక్కించుకున్న టీమిండియా ప్రస్తుతం 68.3శాతం విజ యాలతోనాలుగోస్థానంలో కొనసాగుతుంది. కోహ్లీసేన ఫైనల్‌కు చేరాలంటే ఇంగ్లండ్‌పై 2-1 లేదా 3-1 తేడాతో సిరీస్‌ను గెలవాలి. అదేవిధంగా ఇంగ్లండ్‌ జట్టు భారత్‌పై 3-1, 3-0, 4-0తేడాతో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ డ్రా అయినా లేదా ఇంగ్లండ్‌ 1-0, 2-1, 2-0తేడాతో గెలిచినా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుంది. దక్షిణా ఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడంతో కివీస్‌ ఫైనల్‌కు చేరింది. కాగా మంగళవారం ఐసీసీ తాజాగా విడు దల చేసిన పాయింట్ల పట్టికలో 70.2 విజయాలతో 442పాయింట్లతో ఇంగ్లండ్‌ మొదటి స్థానానికి చేరింది. ఆ తర్వాత 70.0 విజయాలు 420పాయిం ట్లతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో కొనసాగు తోంది. 69.2శాతం విజయాలు 332పాయింట్లుతో ఆస్ట్రేలియా మూడొ స్థానంలో ఉండగా 68.3శాతం విజయాలు 430 పాయింట్లతో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత 43.3శాతం విజయాలు 286 పాయింట్లతో పాక్‌ ఐదోస్థా నంలో ఉంది. దక్షిణాఫ్రి కాపై 2-0తేడాతో టెస్టు సిరీస్‌ గెలవడంతో పాక్‌ తన ర్యాంకును మెరుగుపరుచు కుంది. కాగా పాయింట్లపరంగా చూస్తే 430పాయింట్లతో భారత్‌ రెండోస్థానంలో ఉన్నా ఐసీసీ విజయాలశా తం పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌ బెర్తులను ఖరారు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement