భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ముంగిట భారత ఆఫ్ స్పిన్నర్ పై దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ప్రశంసలు కురిపించాడు. భారతదేశం అందించిన అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు అని ఎల్గర్ కితాబిచ్చాడు. ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్‌కుంబ్లే, కపిల్‌దేవ్ తరువాత అశ్విన్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. సఫారీలతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఎడమచేతివాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయంతో సిరీస్‌కు దూరం కావడంతో అశ్విన్ స్పిన్‌దళంలో కీలకపాత్ర పోషించనున్నాడు.
ఈ సందర్భంగా ఎల్గర్ వర్చువల్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అశ్విన్ నాణ్యమైన బౌలర్, భారత్ సృష్టించిన అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకరు అని మేము గుర్తుంచుకుంటాము. భారత్‌తో పోటీపడటం ఓ సవాల్‌గా తీసుకుంటామని ఎల్గర్ తెలిపాడు. భారత్‌లో పర్యటించినపుడు మా జట్టుకు అశ్విన్ కలిగించిన నష్టం బాగా తెలుసు. కానీ మేము మా గేమ్ ప్లాన్ పై దృష్టిపెట్టామని సఫారీల కెప్టెన్ వ్యాఖ్యానించాడు. భారత బౌలింగ్ లైనప్ చాలా మెరుగ్గా ఉందనే వాస్తవాన్ని మేము గుర్తుంచుకుంటాం. సెంచూరియన్‌లో బ్యాటర్లు, బౌలర్లు తమ ఆటను ఆస్వాదిస్తారని ఎల్గర్ తెలిపాడు. కాగా భారతజట్టు దక్షిణాఫ్రి కాతో మూడు టెస్టులు, మూడు వన్డేల్లో తలపడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital