దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ లో దాదాపు 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇవ్వాల (ఆదివారం) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. చివరిసారి ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఇది టీ20 చరిత్రలోనే అతిపెద్ద అప్‌సెట్‌లో ఒకటిగా నిలిచింది. ఇక.. ఈ టోర్నమెంట్‌కు సరైన ప్రారంభాన్ని ఇవ్వడానికి టీమిండియా ప్లేయర్స్ సన్నద్ధంగా ఉన్నారు.
కాగా, టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్ చేయనుండగా.. కట్టడి చేసి, ఆ తర్వాత కుమ్మెయ్యాలని భారత బ్యాటర్లు తహతహలాడుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ కమ్ కీపర్ రిషబ్ పంత్ ఆడడం లేదు. గాయం కారణంగా అతను మ్యాచ్‌కు దూరమయ్యాడు. పంత్ ప్లేస్‌లో దినేశ్ కార్తీక్‌ని దింపారు. ఇక.. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఎంతో స్పెషల్ అనే చెప్పవచ్చు టీ20ల్లో 100వ మ్యాచ్ కోహ్లీ ఆడబోతుండడం అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.
పిచ్ రిపోర్ట్: ఇక్కడ గత 5 టీ20 మ్యాచ్‌ల్లో జరిగినట్లుగానే పిచ్ బౌలర్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఈ 5 మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 133 పరుగులు, ఇది బౌలర్లకు అనుకూలమైన పరిస్థితులను చూపుతుంది.
కీ మ్యాచ్ అనలిటిక్స్
భారతదేశం, పాకిస్తాన్ ఆట యొక్క అతి తక్కువ ఫార్మాట్‌లో 9 సార్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి, ఇండియా 7 సార్లు విజయం సాధించగా, రెండుసార్లు పాకిస్తాన్‌కు ఫలితం అనుకూలంగా ఉంది.
అత్యధిక యాక్టివ్ రన్-స్కోరర్
విరాట్ కోహ్లీ: 311 పరుగులు, 7 మ్యాచ్‌లు (పాకిస్థాన్‌పై), 118.25 స్ట్రైక్ రేట్
మహ్మద్ రిజ్వాన్: 79 పరుగులు, 1 మ్యాచ్ (భారత్‌పై), 143.64 స్ట్రైక్ రేట్
అత్యధిక యాక్టివ్ వికెట్-టేకర్
భువనేశ్వర్ కుమార్: 5 వికెట్లు, 4 మ్యాచ్‌లు (పాకిస్థాన్‌పై), 7.21 ఎకానమీ రేటు
హసన్ అలీ: 2 వికెట్లు, 1 మ్యాచ్ (భారత్‌పై), 11 ఎకానమీ రేటు