Tuesday, November 26, 2024

Breaking: మూడో టి20లోనూ భార‌త్ గెలుపు.. 6 వికెట్ల విజ‌యంతో ప్ర‌పంచ రికార్డు..

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో భార‌త్ గెలిచింది. వ‌రుస‌గా మూడు టీ20 మ్యాచ్‌ల‌లో విజ‌య‌కేత‌నం ఎగ‌రేసింది. రెండో ఓవ‌ర్‌లోనే కెప్టెన్ రోహిత్ వికెట్ కోల్పోయిన ఇండియా.. ఆ త‌ర్వాత నిల‌క‌డ‌గా ఆడింది. ఆరో ఓవ‌ర్‌లో 51 పురుగుల వ‌ద్ద శాంస‌న్ పెవిలియ‌న్ చేరాడు. 10.5 ఓవ‌ర్ల‌లో 89 ప‌రుగుల వ‌ద్ద దీప‌క్ హుడా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత 12.2 ఓవ‌ర్ల‌లో 103 ప‌రుగుల వ‌ద్ద వెంట‌టేశ్ అయ్య‌ర్ వికెట్ ప‌డిపోయింది.

ప్రపంచ రికార్డు విజయం
ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించి, మూడు మ్యుచులో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. చివరిదైన మూడో టీ20లో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టీమిండియా 147 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన శ్రేయాస్ అయ్యర్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా ముందు 147 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement