Tuesday, November 26, 2024

రెండో టీ20లో భారత్ విజయం

రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. తొలి టీ20లో ఓటమిని రెండో మ్యాచ్‌లో విజయంతో సమం చేసింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ 46, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 28 పరుగులు చేశారు. మలాన్ 24, బెయిర్ స్టో 20 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇక లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. రాహుల్ పరుగులేమీ చేయకుండానే శామ్ కరన్ బౌలింగ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(56: 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)తో వీర విహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ*(73: 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కూడా తోడవడంతో టార్గెట్‌ ఛేజింగ్ మరింత సులభమైంది. తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ అదరగొట్టాడు. అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇక పంత్‌(26) మెరుపు బ్యాటింగ్‌ చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement