టీమ్ ఇండియా నేడు జరుగుతున్న 300 సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. 330 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆంగ్లేయులపై 7 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. 330 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌లో గెలవడమే కాకుండా సిరీస్‌ను కూడా 2-1తో కైవసం చేసుకుంది. భువీ (3), శార్దూల్ (4)తో కూడిన బౌలింగ్ దళం లక్ష్యాన్ని కాపాడుకుంది. సామ్ కరన్ (95*; 83 బంతుల్లో 9×4, 3×6 ), డేవిడ్ మలన్ (50; 50 బంతుల్లో 6×4) విఫల పోరాటం చేశారు. శామ్ కర్రాన్(95 నాటౌట్: 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఇండియా నుంచి విజయాన్ని దూరం చేసినంత పని చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 330 టార్గెట్ సెట్ చేసింది టాప్ ఆర్డర్ విఫలమైన భారత్‌ను రిషభ్ పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్య (64; 44 బంతుల్లో 5×4, 4×6) ఆదుకొన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (67; 56 బంతుల్లో 10×4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కీలక బ్యాట్స్‌మెన్‌ను వరుసగా అవుట్ చేస్తూ విజయానికి చేరుకుంది భారత్. ఫామ్ లో ఉన్న బట్లర్ 18 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా.. ఓపెనర్లు జేసన్ రాయ్(14), జానీ బెయిర్ స్టో(1)ల వికెట్లను వరుస ఓవర్లలో తీసి భువనేశ్వర్ కుమార్ ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత డేంజరస్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్(37)ను నటరాజన్ ఓ ఫుల్ టాస్ బాల్‌తో అవుట్ చేశాడు.