మొహాలీలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పై భారత్ అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.. ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని అయిదు వికెట్లు మిగిలి ఉండగానే 48.4 ఓవర్లలో ఛేధించింది.. చివరి వరకు కెప్టెన్ రాహుల్ క్రీజ్ లో ఉండి భారత్ ను విజయ పథఃలో నడిపాడు.. రాహుల్ 58 పరుగులు, జడేజా 3 పరుగులుతో నాటౌట్ గా ఉన్నారు.. దాంతో, మొహాలీ స్టేడియంలో ఆసీస్‌పై 13 ఏళ్ల తర్వాత గెలుపొందింది. 277 ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(74 :63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(71 : 77 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. ఆసీస్‌పై వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయిన సూర్యకుమార్ యాదవ్(50) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విలువైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపియ్యాడు.
మొహాలీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబూషేన్(39) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతడు ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి