దక్షిణాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరగుతున్నాయి. ఇక ఈ టోర్నీలో యువ భారత్ వరుస విజయాలతో అదరకొడుతొంది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లపై మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించిన భారత జట్టు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.
కాగా, ఈ టోర్నీలో తమ చివరి గ్రూస్ స్టేజ్ గేమ్ ఆడేందుకు రెడీ అయ్యింది భారత జట్టు. తమ గ్రూప్‌లోని అమెరికా జట్టుతో రేపు (ఆదివారం) చివరి గ్రూప్ గేమ్ ఆడనుంది. ఈ మ్యాచ్ బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
గ్రూపు దశలో పాయింట్ల పట్టికలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు ఆడిస్తారు. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 11న తుది పోరు జరగనుంది.
భారత జట్టు అంచనా :
ఉదయ్ సహారన్ (సి), మురుగన్ అభిషేక్ , ఆదర్శ్ సింగ్ , ఆరవెల్లి అవనీష్ , సచిన్ దాస్ , ధనుష్ గౌడ , అర్షిన్ కులకర్ణి , రాజ్ లింబాని , ఇన్నేష్ మహాజన్ , ప్రియాంషు మోలియా , ముషీర్ ఖాన్ , సౌమీ పాండే , రుద్ర పటేల్ , ఆరాధ్య శుక్లా , నమన్ తివారీ
యూఎస్‌ఏ జట్టు అంచనీ :
రిషి రమేష్ (సి), ఉత్కర్ష్ శ్రీవాస్తవ (విసి), అమోఘ్ అరేపల్లి, ఆర్యన్ బాత్రా, రాయన్ భగాని, ఖుష్ భలాలా, ప్రన్నవ్ చెట్టిపాళయం, ఆర్య గార్గ్, సిద్దార్థ్ కప్పా, భవ్య మెహతా, ఆరిన్ నద్కర్ణి, మానవ్ నాయక్, పార్థ్ పటేల్, ఆరీమన్ సుబ్రమణియన్